స్వల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

136

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,700 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 20 రూపాయలు పెరిగి 36,390 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు మరింత తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 46,700 రూపాయలకు దిగివచ్చింది.

RRR

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,350 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,150 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 100 రూపాయలు తగ్గింది. దీంతో 46,700 రూపాయలకు పడిపోయింది.