ఖ‌రారైన పవన్‌ కళ్యాణ్ రాయలసీమ పర్యటన..

27

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1 నుండి ఆరు రోజులు పాటు నాలుగు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటన సందర్భంగా పార్టీ బలోపేతంపై జనసేన నాయకులతో సమీక్షించడంతో పాటు వివిధ రంగాల్లోని రైతులు, నిపుణులతో సమావేశంకానున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఉన్న సమస్యలు, లోపాలను స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తామని జనసేన నాయకులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని సమస్యలను ఎత్తిచూపి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన స్వరం వినిపించనున్నారు. పవన్ డిసెంబర్ 1 న మధ్యాహ్నం 1 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు కడప జిల్లా రైల్వే కొడూరుకు వెళతారు, అక్కడ చెరకు రైతులతో సమావేశమవుతారు.

RRR

డిసెంబర్ 2 న తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థుల తోపాటు పార్టీ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. మరుసటి రోజు, కడప, రాజంపేట నియోజకవర్గాల పార్టీ నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తరువాత ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె చేరుకుని డిసెంబర్ 4 న పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. డిసెంబర్ 5 న అనంతపురం నాయకుల సమావేశంలో పాల్గొంటారు. తరువాత, డిసెంబర్ 6 న రాయలసీమ జిల్లాల స్థానిక నాయకులతో సంప్రదిస్తారు.