గుడ్ న్యూస్‌: మ‌రో సారి ప‌త‌న‌మైన‌ బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

34

నిన్న భారీగా క్షీణించిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా ప‌త‌న‌మైంది. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 39,410 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయలు తగ్గి 36,130 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 46,300 రూపాయలుగా ఉంది.

RRR

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గి 38,100 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గి 36,900 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కూడా కేజీకి 100 రూపాయలు తగ్గి 46,300 రూపాయల వద్దకు దిగివచ్చింది.