తాత చనిపోతున్నాడని తెలిసి… కొడుకులతో కలిసి చివరి బీర్ తాగించిన మనవడు…!

36

మనిషి చావుని ఊహించడం అనేది చాలా కష్టం… ఎక్కడో కొద్ది మందికి మాత్రమే చావు గురించి తెలుస్తుంది. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే రేపు చనిపోవచ్చు లేదా ఈ రోజు చనిపోవచ్చు అనేది వైద్యులు చెప్తూ ఉంటారు. దీనితో వారి వారి కుటుంబ సభ్యులు వారి చివరి కోరికలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవితంలో చివరి సారి వారికి ఏం కావాలో అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.

RRR

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది… ఆడం స్కీం అనే ట్విట్టర్ యూజర్ తన తాత చివరి కోరికను తీర్చాడు… ఆయనకు తన కొడుకులతో కలిసి బీర్ తాగాలని ఉందని తెలుసుకున్న ఆడం… ఆస్పత్రి బెడ్ పై ఉన్న తన తాతతో, ఆయన కుమారులతో కలిసి బీర్ తాగించాడు. దీనికి సంబంధించిన ఫోటోని అతను ట్విట్టర్ లో షేర్ చేయగా దానికి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఆయన బీర్ తాగిన మరుసటి రోజే మరణించడం గమనార్హం… దీనిపై పలువురు ట్విట్టర్ యూజర్లు స్పందించారు… తమ తాతల కోసం తమ అమ్మమ్మల కోసం వాళ్ళు ఏ౦ చేసారు అనేది అతనికి రిప్లయ్ రూపంలో తెలిపారు.

తన అమ్మమ్మకు కూడా తాను ఇలాగే చేసానని ఆమె బైలీ షాట్స్ తీసుకున్నారని రిట్వీట్ చేసాడు ఒక యూజర్. మరో యూజర్ మేలో నాన్నతో కూడా అదే పని చేశాను. కోల్డ్ బీర్ మరియు యాంకీ గేమ్ ఆడాను అని ఆ యూజర్ పేర్కొన్నారు. “నేను మీకు తెలియదు … కానీ నేను దీనిని అనుభవించాను. నా తాత గడిచే కొన్ని రోజుల ముందు అతను నాన్నను కోరాడు. అతనికి సిగార్ మరియు బీరు కావాలని… దీనితో మేము అతనికి వాటిని అందించామని అతను పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. తమ వారి కోసం చివర్లో ఏం చేసింది పలువురు వివరిస్తున్నారు.