చెవిటి పిల్లలను లైంగికంగా వేధించినందుకు… పూజారులకు 40 ఏళ్ళ జైలు శిక్ష…!

122

చర్చి పాఠశాలలో చెవిటి పిల్లలను లైంగికంగా వేధించినందుకు అర్జెంటీనాలోని ఒక న్యాయస్థానం ఇద్దరు రోమన్ కాథలిక్ పూజారులకు 40 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… మెన్డోజా ప్రావిన్స్‌లోని పాఠశాలలో  హొరాసియో కార్బాచో మరియు నికోలా కొరాడి, అలాగే తోటమాలి, 2004 నుండి 2016 వరకు అత్యాచారాలకు పాల్పడటంతో కోర్ట్ ఈ సంచలన తీర్పు వెల్లడించింది. సోమవారం ఈ కేసుకి సంబంధించిన వాదనలను విన్న కోర్ట్… వారికి శిక్షను ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 

RRR

బాధితుల్లో చాలా మంది తీర్పు కోసం కోర్ట్ కి రావడంతో కోర్ట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కాథలిక్ చర్చి గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పిల్లల లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంది. చర్చి ఈ దుర్వినియోగాలను దాచడానికి ప్రయత్నిస్తోందిని… కాని ఈ పూజారులు మా పిల్లలపై అత్యాచారం చేసి, వేధింపులకు గురిచేశారని బాధితుల తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక తీర్పు వెల్లడిస్తున్న సమయంలో కొందరు తల్లులు… కోర్ట్ ప్రాంగణంలో ఏడుస్తూ కనపడటం హృదయ విదారకంగా మారింది.

ప్రావిన్షియల్ రాజధాని మెన్డోజాలోని కోర్టు అర్జెంటీనా పూజారి కార్బాచోకు 45 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతను పిల్లల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సాక్ష్యాలతో సహా కోర్ట్ ముందు ఉంచారు. ఇక 1970 లలో ఇటలీలోని వెరోనాలోని ఇన్స్టిట్యూట్ పాఠశాలలో అత్యాచారాలకు పాల్పడుతున్న 83 ఏళ్ల ఇటాలియన్ జాతీయుడైన కొరాడికి 42 సంవత్సరాల శిక్ష విధించింది. ఇక వారిని మళ్ళీ పూజలు చేయకుండా కోర్ట్ నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. తోటమాలి అర్మాండో గోమెజ్ కు 18 ఏళ్ళ జైలు శిక్ష విధించారు.