విలన్ గా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ స్టార్ హీరో..

38

హీరోలు, విలన్ లు గా ,విలన్ లు హీరోలు గా మారడం అనేది కొత్తేమి కాదు.. ఇప్పటికి చాలా మంది అలా మారి సక్సెస్ అయిన వారే. ఇక తాజాగా విజ‌య్ సేతుప‌తి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అయన హీరో నుండి విలన్ గా మారబోతున్నారు. ఏకంగా నాలుగు సినిమాలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట విజ‌య్ సేతుప‌తి.. విజ‌య్ తన 64 వ చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌…ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన భార‌తీయుడు 2 లోను విల‌న్‌గా న‌టించేందుకు ముందుకొచ్చాడ‌ట‌ విజ‌య్ సేతుప‌తి.

RRR

భారీ అంచనాల నడుమ ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే కాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలో కూడా విజయ్ విలన్ గానే నటిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను విజయ్ చేయనున్నారని తెలుస్తుంది. దీనిపైన ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.