72 గంటల పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ సరికొత్త ప్రభంజనం…..!!

37

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు, రోజురోజుకు ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో పెంచుకుంటూ పోతోంది. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, అలనాటి నటి లేడీ అమితాబ్ విజయశాంతి చాలా రోజుల తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇకపొతే ఈ సినిమా అధికారిక టీజర్ మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించడం జరిగింది.

RRR

ఇక ఆ టీజర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇక ఈ టీజర్ మరొక సరికొత్త రికార్డుని నిన్న యూట్యూబ్ లో నమోదు చేయడం జరిగింది. ఏకధాటిగా యూట్యూబ్ లో 72 గంటలపాటు ఆ టీజర్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉంది. అది మాత్రమే కాక తమిళ్, పంజాబీ, గుజరాతి లో కూడా ఆ టీజర్ దాదాపుగా 48 గంటల పాటు ట్రెండింగ్ కొనసాగడం జరిగింది. ఇక ఈ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు యూనిట్, 72 గంటలపాటు యూట్యూబ్ లో సరిలేరు టీజర్ ప్రభంజనం అంటూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో రావు రమేష్, రఘు బాబు, సుబ్బ రాజు, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, జయప్రకాశ్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత తదితరులు ఇంత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న చేయనుంది సినిమా యూనిట్…!!