సంక్రాంతికి అల్లుళ్లే కాదు, మరదళ్ళు కూడా వస్తున్నారు….!!

25

అతి త్వరలో రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో తెరెక్కుతున్న అలవైకుంఠపురములో, అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు మురుగదాస్ ల కలయికలో రూపొందుతున్న దర్బార్, నందమూరి కళ్యాణ్ రామ్ మరియు సతీష్ వేగేశ్న ల కలయికలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా, చివరిగా వెంకటేష్, నాగ చైతన్య ల కలయికలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీమామ సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి.

RRR

కాగా వీటిలో ఎక్కువగా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల పైనే మెజారిటీ ప్రేక్షకుల దృష్టి ఉండనుంది. ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలవైకుంఠపురములో నుండి మూడు సాంగ్స్, మరియు సరిలేరు నీకెవ్వరు టీజర్ ఆయా సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెంచేయడం జరిగింది. అయితే ఈ విధంగా సంక్రాంతికి అల్లుళ్లు మాత్రమే కాదండోయ్, ఇద్దరు మరదళ్ళు కూడా మన ముందుకు వచ్చి సందడి చేయబోతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ప్రత్యేక గీతంలో సూపర్ స్టార్ తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా చిందేయనుంది. ఆమె మహేష్ బాబుతో కలిసి చేసే ఆ సాంగ్, మొత్తం సినిమాకే పెద్ద హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అలవైకుంఠపురములో సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఒక ప్రత్యేక గీతంలో నర్తించనుంది. స్టైలిష్ స్టార్ సరసన ఆమె నటించబోయే ఈ సాంగ్ ని అతిత్వరలోనే పిక్చరైజ్ చేయనుంది ఆ సినిమా యూనిట్. ఈ సాంగ్ సినిమా లోని సాంగ్స్ అన్నిటిలోకి ఎంతో అద్భుతంగా ఉంటుందని, ఒకరకంగా త్రివిక్రమ్ ఎంటైర్ కెరీర్ లో గుర్తుండిపోయేలా ఈ సాంగ్ నిలవడం ఖాయం అని కూడా సమాచారం. సో, ఈ విధంగా రాబోయే సంక్రాంతికి అల్లుళ్లతో పాటు ఈ విధంగా ఇద్దరు మరదళ్ళు కూడా మన ముందుకు ప్రత్యేక గీతాలతో రాబోతున్నారు అన్నమాట. అయితే ఈ సంక్రాంతి సినిమాల్లో దేనికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి….!!