నిర్మాతగా మారనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌..

49

క‌థానాయిక‌గా సమంత ద‌క్షిణాది చిత్రసీమ‌పై బ‌ల‌మైన ముద్ర వేసింది. ఏమాయ చేసావే.. సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సమంత.. చేసిన మొదటి సినిమాతో ఇటు అందం, అటు అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా హిట్టు కావడంతో సమంత రేంజ్ పెరిగిపోయింది. ఇక ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన‌ `ఓబేబీ`తో సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పైనే మోయ‌గ‌ల స‌మ‌ర్థ‌త ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పింది. పెళ్లి తర్వాత సమంత, కథకి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది.

RRR

కథల ఎంపికలో మంచి అభిరుచిని కనబరుస్తున్న సమంత నిర్మాణ రంగం వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన స్నేహితుడు రాహుల్ తీసిన చి.ల.సౌ సినిమాని చూసి బాగుండడంతో ఆ కథను అక్కినేని బ్యానర్ నుండి విడుదల చేయలని మామ నాగ్ ని కోరింది. ఆ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మంచి కథలను వింటున్న సమంత నచ్చితే నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.