బెల్లంకొండ‌లో ఇంత మార్పా… ఇండ‌స్ట్రీ షాక్‌…!

32

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రు అయిన బెల్లంకొండ సురేష్ త‌న‌యుడిగా వెండి తెరంగ్రేటం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఎట్ట‌కేల‌కు రాక్ష‌సుడు రీమేక్ సినిమా రూపంలో ఓ హిట్ వ‌చ్చింది. తొలి సినిమా అల్లుడు శీను సినిమా నుంచి ప్ర‌తి సినిమాకు కోట్లు ఖ‌ర్చు పెడుతూ క‌ష్ట‌ప‌డుతున్నా బెల్లంకొండ మాత్రం హిట్ అందుకోలేక‌పోయాడు. ఎట్ట‌కేల‌కు రాక్ష‌సుడు సినిమాతో హిట్ కొట్టిన శ్రీనివాస్ ఇప్పుడు మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నాడు.

RRR

బెల్లంకొండ మాస్ ఇమేజ్ కోసం ఎంత ప‌రితిపించినా డిఫ‌రెంట్ కాన్సెఫ్ట్‌తో తీసిన రాక్ష‌సుడు సినిమాయే హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మ‌రోసారి బెల్లంకొండ అదే త‌ర‌హాలో డిఫ‌రెంట్ కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో ఎప్పుడూ క‌నిపించ‌ని స‌రికొత్త లుక్‌లో బెల్లంకొండ క‌నిపిస్తున్నాడు.

8 ప్యాక్ బాడీతో పాటు గెడ్డం లుక్‌లో చాలా స్టైలీష్‌గా ఉన్నాడు. శ్రీను వేసుకున్న ష‌ర్ట్‌తో పాటు నిలుచున్న స్టైల్ కూడా కేక పుట్టిస్తోంది. బెల్లంకొండ స్టైలీష్ లుక్ చాలా బాగుందంటూ నెటిజ‌న్లు లైకులు, కామెంట్లు కుమ్మేస్తున్నారు. బెల్లంకొండ‌కు సోష‌ల్ మీడియాలో ఈ రేంజ్‌లో పాజిటివ్ వైబ్రైష‌న్స్ రావ‌డం ఇదే ఫ‌స్ట్ టైం. ఇక ఇండ‌స్ట్రీ వాళ్లు కూడా ఈ లుక్ చూసి షాక్ అవుతున్నారు.

ఇంత‌కు ఈ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రో చెప్ప‌లేదు క‌దూ..! సంతోష్ శ్రీనివాస్ రెండేళ్ల క్రితం రామ్‌తో హైప‌ర్ సినిమా తీసిన సంతోష్ ఇప్పుడు బెల్లంకొండ‌తో ఈ సినిమా తీస్తున్నాడు. ఇక విజ‌య్ తెరి సినిమా క‌థ‌నే తెలుగుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా తీస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్‌..?