బాలయ్య సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ రోజా..!

37

ప్రస్తుతం సినీ నటి రోజా.. ఒకవైపు రాజకీయాలు..మరోవైపు జబర్ధస్త్ షోతో తీరిక లేకుండా గడిపింది. అంతేకాదు వైసీపీ నుంచి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో గతంలో ఎన్నో సినిమాలు వచ్చి, బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీరిద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొత్త చిత్రం తెరకెక్కబోతోంది.

RRR

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ రోల్ పోషించబోతున్నారు. ఇందులో ఓ పవర్ ఫుల్ లేడీ పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర కోసం రోజాను బోయపాటి శ్రీను సంప్రదించగా… ఆలోచించి చెబుతానని ఆమె సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. మరి రోజా ఈ పవర్‌ఫుల్ రోల్ చేయడానికి ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి. ఒక‌వేల రోజా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఇద్దరి అభిమానులకు పండగే అని చెప్పాలి.