కూతురి సినిమా కోసం వెయిటింగ్ అంటున్న మహేష్ బాబు…..!!

78

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్ ముద్దుల తనయ సితార, చిన్నప్పటి నుండి ఎంతో చలాకీగా ఉంటూ తన తండ్రి సినిమాల్లోని సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం, పాడడం వంటివి చేస్తూ ఉంటుంది. ఇటీవల మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురైన ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన సితార, ఎప్పటికపుడు కొత్త కొత్త వీడియోస్ తో మంచి పేరు సంపాదిస్తోంది. ఇక ఎట్టకేలకు ఆమె ఇటీవల సినిమా రంగప్రవేశం చేసింది.

RRR

అయితే నటిగా కాదు, హాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్’ కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘ఫ్రోజెన్ 2’ లో ప్రధాన పాత్రైన ఎల్సా పాత్ర, చిన్నప్పటి క్యారెక్టర్ కు సితార వాయిస్ ని అందిస్తోంది. ఇక కొద్దిరోజుల క్రితం డిస్నీ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని ఆవిష్కరించడం జరిగింది. కాగా ఆ కార్యక్రమంలో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్తున్న హీరోయిన్ నిత్యా మీనన్ తో పాటు సితార కూడా విచ్చేసింది.

తన తల్లి నమ్రత మహేష్ తో కలిసి వచ్చిన సితార, తనకు ఫ్రోజెన్ మూవీ అంటే ఎంతో ఇష్టం అని, అలానే అందులో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇకపోతే కాసేపటి క్రితం తన ముద్దుల కూతురు సినిమా మరొక రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుండడంతో, ఆమె తొలి సినిమా తప్పకండా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని, అలానే తాను ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది……!!