‘గోవిందా హరి గోవిందా’ అంటున్న మెగాస్టార్…!!

210

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీతో కొన్నేళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇకపోతే దాని తరువాత ఆయన నటించిన 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ తన అత్యద్భుత నటనతో ప్రేక్షకుల ఆకట్టుకున్నారు అనే చెప్పాలి.

RRR

ఇకపోతే ఆయన నటించబోయే 152వ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా చూడని కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కబోయే ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్స్ గా గోవింద ఆచార్య, గోవింద హరి గోవింద అనే పేర్లు కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్ ని ఆల్మోస్ట్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే దానికి ఒక ప్రధాన కారణం ఉందని, అదేమిటంటే నేటి ఉదయం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో సినిమాకు పక్కాగా ఇదే టైటిల్ పెడతారని అంటున్నారు. కాగా నేడు పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మెగాస్టార్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటించబోయే ఈ సినిమాకు సైరా నరసింహారెడ్డికి సంగీతాన్ని అందించిన అమిత్ త్రివేదీనే తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడికోబోతున్నట్లు తెలుస్తోంది….!!