‘అల వైకుంఠపురములో’ విషయంలో త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా…..??

30

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకోవడం జరిగింది. బన్నీ సరసన రెండవసారి పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ ని, అలానే పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్, పోస్టర్లు, సాంగ్స్ తదితరులు అన్ని కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై విపరీతమైన అంచనాలుఏర్పరచడం జరిగింది. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఆయన అక్క పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

RRR

ఇక ఇదివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి సినిమాలు రెండూ కూడా మంచి విజయాలు అందుకోవడంతో ఈ సినిమా కూడా తప్పకుండా మంచి సక్సెస్ ని సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఇప్పటివరకు వచ్చిన త్రివిక్రమ్ సినిమాలన్నిటిలోకి అలవైకుంఠపురములో సినిమా కోసం త్రివిక్రమ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వార్తలను బట్టి, ఈ సినిమాను త్రివిక్రమ్ కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా మాస్, యూత్, క్లాస్, లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ దృష్టిలోపెట్టుకుని వారందరికీ కావలసిన అన్ని అంశాలను సమపాళ్లలో సినిమాలో పొందుపరచడం జరిగిందట.

ala vaikunta puram lo drops on release date

ముందుగా కథ రాసుకున్నపుడే దానిని అన్నివర్గాలకు చేరువయ్యేలా ఎంతో అలోచించి మరీ కొన్ని మెరుగులు దిద్దిన త్రివిక్రమ్, సినిమా చిత్రీకరణ సమయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించినట్లు చెప్తున్నారు. గతంలో అజ్ఞాతవాసి సినిమాతో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న త్రివిక్రమ్, ఆ తరువాత ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత సినిమాతో మంచి హిట్ కొట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం చేస్తున్న ఈ అలవైకుంఠపురములో సినిమాతో ఆ హిట్ల పరంపరను కొనసాగించాలనే గట్టి పట్టుదలతోనే ఏంటో కసితో ఈ సినిమా తీస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర విజయాన్ని అందుకుని ఆయన ఆశలు నెరవేరుస్తుందో చూడాలి….!!