సమంత పై ఫ్యాన్స్ గుస్సా…..కారణం ఏంటంటే….??

34

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ఇటీవల తాను ప్రేమించిన నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటి కోడలు గా మారిపోయింది. నిజానికి ఆమె నటించిన తొలి సినిమా ఏ మాయ చేసావే సమయంలోనే తాను చైతన్యతో లవ్ లో ఉన్నానని సమంత పలు మార్లు చెప్పడం జరిగింది. ఇక పెళ్లి తరువాత కూడా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్న సమంత, కొద్దిరోజుల క్రితం భర్త నాగ చైతన్యతో కలిసి మజిలీ అనే మూవీలో నటించి మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది.

RRR


ఇక ఆ తరువాత ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా కూడా బాగానే ఆడడంతో, ఇక పై మరింత జాగ్రత్తగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని మరింత జాగ్రత్తగా చేసుకోవాలని చూస్తోంది. ఇక తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎంతో యాక్టివ్ గా ఉంటూ, తన ఫ్యాన్స్ తో కొన్ని విషయాలు పంచుకునే సమంత, మొన్న తన భర్త చైతన్య బర్త్ డే సందర్భంగా ఒక అభిమాని సింహాచలం దేవాలయానికి తన మోకాళ్ళతో మెట్లను ఎక్కుతూ వెళ్లడం జరిగింది. అయితే ఆ వీడియో సమంత వరకు చేరడంతో, ఆ అభిమానిని ఎంతో మెచ్చుకున్న సమంత, అతడిని త్వరలోనే కలుస్తాను అంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.

అయితే ఇప్పుడు ఇదే ఘటన సమంతను ఇరకాటంలోకి నెట్టింది. మీ భర్త గారి కోసం ఒక అభిమాని ప్రాణాలు పణంగా పెట్టి సింహాచలం గుడిమెట్లు తన మోకాళ్ళతో ఎక్కితే, అటువంటి ప్రాణాంతకమైన పనులు చేయవద్దు అని చెప్పవలసింది పోయి, వాటిని ప్రోత్సహించడం ఏమిటని కొందరు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!