చిరంజీవి, వెంకటేష్, విజయ్ దేవరకొండ, రామ్ అందరూ ఆయనతోనే…..!!

25

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కినేని నాగార్జున నటించిన అంతం సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మణిశర్మ, ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగడం జరిగింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, యువసామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లతో వరుసగా ఛాన్స్ లు అందుకుని మంచి సక్సెస్ఫుల్ మ్యూజిక్ అందించిన మణిశర్మకు మెల్లగా టాలీవుడ్ లో మంచి ఛాన్స్ లు రావడం మొదలయింది .ఇక ఆ తరువాత కాలంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ సహా అందరితో కూడా చాలా సినిమాలకు వర్క్ చేసిన మణిశర్మ, ఒకానొక సమయంలో టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలన్నీ కూడా తానే చేసేవారు.

RRR

అంతలా బిజీ అయిన మణిశర్మకు మెల్లగా పోటీగా దేవిశ్రీప్రసాద్, ఆర్ పి పట్నాయక్ వంటి వారు రావడంతో మణిశర్మ కి ఒకింత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక అనంతరం మరింత మంది యువ సంగీత దర్శకుల రాక, అదే సమయంలో ఎస్ ఎస్ థమన్ ఎంటర్ అవడంతో చాలా వరకు సినిమాలు దేవిశ్రీప్రసాద్, థమన్ లకు దక్కడం మొదలయ్యాయి. ఇక ఆ తరువాత మణిశర్మకు చాలావరకు అవకాశాలు తగ్గాయి. ఇక ఇటీవల మణిశర్మకు ఏదో ఒకటి, రెండు సినిమాలు తప్పించి మరెటువంటి అవకాశాలు లేవు అనే చెప్పాలి.

అయితే కొన్నాళ్ల క్రితం నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమా అవకాశాన్ని అందుకుని దానికి మంచి మ్యూజిక్ ఇవ్వడంతో, పూరి జగన్నాథ్ తన ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం మణిశర్మనే ఎంచుకోవడం జరిగింది. అనూహ్యంగా ఆ సినిమాలోని సాంగ్స్ తో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో మళ్ళి ప్రస్తుతం మణిశర్మకు అవకాశాలు మొదలయ్యాయి. మెగాస్టార్ 152 మూవీ, వెంకటేష్ అసురన్ రీమేక్, విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మూవీ, రామ్ నటిస్తున్న రెడ్ మూవీ సహా మొత్తం నాలుగు సినిమాలు ప్రస్తుతం మణిశర్మ ఖాతాలో ఉన్నాయి. దీనితో మళ్ళి ఆయన ఫామ్ లోకి వచ్చినట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ సినిమాలతో మణిశర్మ ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి….!!