ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధం అవుతోన్న బాలయ్య ‘రూలర్’….??

34

యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా రూలర్. గత ఏడాది బాలయ్యకు జైసింహా వంటి మంచి సక్సెస్ఫుల్ మూవీని అందించిన కేఎస్ రవికుమార్, ఈ సినిమాతో ఆయనకు మరొక హిట్ ఇచ్చేలా సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. బాలయ్య, ధర్మ అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా సి రామ్ ప్రసాద్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.

RRR

హ్యాపీ మూవీస్, సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా సి కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 15న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఎంతో వైభవంగా నిర్వహించనుందట సినిమా యూనిట్.

ఇందు కోసం మరికొద్దిరోజుల్లో గ్రాండ్ గా ఏర్పాట్లు కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. యూనిట్ సభ్యులతో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్న ఈ వేడుక కోసం ఖర్చు కూడా భారీగానే పెడుతున్నారట. బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక చావ్లా ఒక ముఖ్య  పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తొలి సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకులు ముందుకు తీసుకు రానున్నారు….!!